సాహోలో విలన్‌గా బాలీవుడ్ హీరో.. ఇక ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ.. | Neil Nitin Mukesh has reportedly signed Sujeeth’s film, Saaho.

  0
  20
  Want create site? Find Free WordPress Themes and plugins.


  బాహుబలి2 చిత్రం రిలీజ్ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించే సాహో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరుగడంతో ఆ స్థాయికి తగినట్టుగా సాహోను నిర్మించాలనే పట్టుదల మొదలైంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లో అప్పుడప్పుడు హీరో పాత్రలు వేస్తూన్న నీల్ నితిన్ ముఖేష్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్టు చిత్ర నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

  31 1496231188 saaho1 సాహోలో విలన్‌గా బాలీవుడ్ హీరో.. ఇక ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ.. | Neil Nitin Mukesh has reportedly signed Sujeeths film, Saaho.

  సాహో కోసం సంతకం..

  ప్రభాస్ తర్వాత ఈ సినిమా కోసం సంతకం చేసిన రెండో వ్యక్తి నీల్ నితిన్ ముఖేష్. ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా టెర్రిఫిక్‌గా ఉంటుంది. సాహోలో ప్రభాస్, నీల్ నితిన్ మధ్య జరిగే సన్నివేశాలు, పోరాటాలు ఆసక్తికరంగా ఉంటాయి. నీలి నితిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ అని చిత్ర నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఈ చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

  31 1496231195 saaho2 సాహోలో విలన్‌గా బాలీవుడ్ హీరో.. ఇక ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ.. | Neil Nitin Mukesh has reportedly signed Sujeeths film, Saaho.

  అమితాబ్, సల్మాన్ సినిమాల్లో..

  బాలీవుడ్‌లో నీల్ నితిన్ ముఖేష్ ఇటీవల అమితాబ్ బచ్చన్ నటించిన వజీర్, సల్మాన్ ఖాన్ చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయోలో సినిమాలో విలన్‌గా కనిపించాడు. ఆయన పోషించిన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. వాస్తవానికి చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ నటించాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదనే ఇన్‌సైడ్ టాక్.

  31 1496231202 saaho3 సాహోలో విలన్‌గా బాలీవుడ్ హీరో.. ఇక ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ.. | Neil Nitin Mukesh has reportedly signed Sujeeths film, Saaho.

  ఇటీవల వివాహం..

  నీల్ నితిన్ ముఖేష్ వివాహం ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. తన ప్రేయసి రుక్మిణి సహాయ్‌ మెడలో మూడు మూళ్లు వేశాడు. వీరి వివాహం ఫిబ్రవరి 9న డెస్టినేషన్ మ్యారేజ్‌గా జరిగింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రంలో జై లవకుశలో కూడా ఈయన నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

  31 1496231209 saaho4 సాహోలో విలన్‌గా బాలీవుడ్ హీరో.. ఇక ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ.. | Neil Nitin Mukesh has reportedly signed Sujeeths film, Saaho.

  ఇంకా తేలని హీరోయిన్ల వ్యవహారం

  సాహో చిత్రానికి సంబంధించి.. హీరోయిన్ల వేట ఇంకా పూర్తి కాలేదనేది ఫిలిం నగర్ సమాచారం. దిశాపటానీ, శ్రద్ధాకపూర్‌ రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వారిని పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్‌గా కత్రినా కైఫ్ ఎంపికైందని, మరోసారి బాహుబలి హీరోయిన్ అనుష్కశెట్టి మరోసారి ప్రభాస్‌తో జతకట్టనున్నదనే వార్తలు జోరందుకున్నాయి.

  PLEASE READ  Anchor Predeep Shocked After Receiving Rs150 | Telugu TV Channels | Pradeep Success Story | Taja30

  Story first published: Wednesday, May 31, 2017, 17:18 [IST]

  English summary

  After the Baahubali films made him a household name, Prabhas’s next Saaho has been the subject of much speculation. Several names have been associated with the film, from Katrina Kaif to Anushka Shetty. But the antagonist has been finalised. According to a reports, Neil Nitin Mukesh is set to play the baddie in Saaho.

  Please Wait while comments are loading…  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY