బిగ్‌బాస్ షో గురించి పుస్తకం రాస్తా, అందరికీ చెప్పేస్తా: కత్తి మహేష్ | Mahesh Eliminated From Bigg Boss Telugu

  0
  12
  Want create site? Find Free WordPress Themes and plugins.


  బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న ‘బిగ్‌బాస్’ నుంచి ఈ వారం మహేశ్ కత్తి ఎలిమినేట్ అయ్యాడు.జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌ చేస్తున్న బిగ్ బాస్ షో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బెగ్గెస్ట్ రియాలిటీ షో. ఇటీవల ప్రారంభమైన ఈ షో 27 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 28వ ఎపిసోడ్‌లోకి ఎంటరైపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. శని, ఆదివారాల్లో బిగ్‌బాస్‌‌ షోలో బాద్ షా ఎంట్రీ ఇస్తుండటంతో మరింత జోష్‌తో నడిచింది ఈ షో. మరోవైపు బిగ్ బాస్ హౌస్‌నుండి ఒకేసారి ఇద్దరు కన్టెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్‌లో ఉండటంతో ఆసక్తిగా సాగింది.

  13 1502602018 katti 1 బిగ్‌బాస్ షో గురించి పుస్తకం రాస్తా, అందరికీ చెప్పేస్తా: కత్తి మహేష్ | Mahesh Eliminated From Bigg Boss Telugu

  సలహాలు, సూచనలు

  వస్తూవస్తూ బిగ్‌బాస్ ‘బాంబు’ను ఆదర్శ్‌పై విసిరాడు. వారం రోజులపాటు హౌస్‌లోని అందరి ప్లేట్లు, గ్లాసులు, కడగాలని ఆదర్శ్‌కు పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మహేశ్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేశాడు. హౌస్‌లో ఉన్న వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు.

  13 1502602032 katti 2 బిగ్‌బాస్ షో గురించి పుస్తకం రాస్తా, అందరికీ చెప్పేస్తా: కత్తి మహేష్ | Mahesh Eliminated From Bigg Boss Telugu

  మహేష్ కత్తి

  ఎవరెవరు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాడు. తన ప్రవర్తన అలా ఉండాల్సింది కాదని మహేష్ కత్తి తన తప్పును ఒప్పుకోవడంతో మీరు చేసిన తప్పును నాతో పాటు ప్రేక్షకులు కూడా క్షమించలేదని అందుకే ఈవారం మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్‌నుండి ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించి మహేష్ కత్తిని బిగ్ బాస్ హౌస్‌నుండి ఇంటికి పంపించారు.

  13 1502602046 katti 3 బిగ్‌బాస్ షో గురించి పుస్తకం రాస్తా, అందరికీ చెప్పేస్తా: కత్తి మహేష్ | Mahesh Eliminated From Bigg Boss Telugu

  ప్లేట్లు గిన్నెలు కడగాలని

  ఇక బిగ్ బాస్ హౌస్‌ను వీడే సెలబ్రిటీకి ప్రతివారం ఇచ్చే బిగ్ బాంబ్ ఆయుధాన్ని మహేష్ కత్తికి అందించగా.. దాన్ని తనకు నచ్చని ఆదర్శ్‌పై విసిరాడు. దీంతో బిగ్‌బాస్ నుండి అనౌన్స్‌మెంట్ వచ్చేంతవరకూ హౌస్‌లో ఉన్న ప్లేట్లు గిన్నెలు కడగాలని ఆదర్శ్‌‌పై మహేష్ కత్తిపై బిగ్ బాంబ్ వదిలాడు.

  13 1502602058 katti 4 బిగ్‌బాస్ షో గురించి పుస్తకం రాస్తా, అందరికీ చెప్పేస్తా: కత్తి మహేష్ | Mahesh Eliminated From Bigg Boss Telugu

  శివబాలాజీ సేఫ్ జోన్‌లో

  ఇక ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో శివబాలాజీ సేఫ్ జోన్‌లోకి రాగా.. మహేష్ కత్తి ఎలిమినేట్ అవ్వగా హరితేజ, కల్పన, దీక్షల్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇక బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో సెలబ్రిటీ రాబోతున్నట్టు టీజర్ వదిలారు.

  PLEASE READ  బాబు బాగా బిజీ ఆంటీ...అంతకు ముందు ఏం చేసిందో తెలుసా? | Babu Baga Busy Aunty Real Age

  13 1502602071 katti 5 బిగ్‌బాస్ షో గురించి పుస్తకం రాస్తా, అందరికీ చెప్పేస్తా: కత్తి మహేష్ | Mahesh Eliminated From Bigg Boss Telugu

  చాలా నేర్చుకున్నా

  అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీ ఎవరో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే! బిగ్‌బాస్ హౌస్ విశేషాల గురించి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించగా.. హౌస్‌లో తాను చాలా నేర్చుకున్నానని, చాలా అనుభవంతో, ఆలోచనలతో బయటకు వచ్చానని చెప్పారు. ఈ షో గురించి అందరికీ తెలియజేసేందుకు త్వరలో పుస్తకం రాస్తానని మహేష్ కత్తి ఈ సందర్భంగా ప్రకటించారు.

  13 1502602083 katti 6 బిగ్‌బాస్ షో గురించి పుస్తకం రాస్తా, అందరికీ చెప్పేస్తా: కత్తి మహేష్ | Mahesh Eliminated From Bigg Boss Telugu

  ఎంత దుమారం రేగుతుందో

  ఆ పుస్తకంలో తన గురించి కూడా ఒకపేజీ ఉండేలా చూడాలని ఎన్టీఆర్ సరదాగా రిక్వెస్ట్ చేశారు. స్వతహాగా రచయిత, విమర్శకుడు అయిన మహేష్ కత్తి బిగ్‌బాస్ గురించి ఎలాంటి విషయాలు చెబుతారో వేచిచూడాలి. మొత్తానికి ఇప్పటికే రచయితగా కాస్త పేరున్న మహేష్ కత్తి తన రెగ్యులర్ నిర్మొహమాటం తో ఈ పుస్తకం కూడా బయటికి తెస్తే ఎంత దుమారం రేగుతుందో.

  English summary

  Mahesh katti To Write a book on Bigg Boss show, mahesh announces ofter Eliminated From Bigg Boss Telugu

  Story first published: Sunday, August 13, 2017, 10:59 [IST]

  Please Wait while comments are loading…  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY