LK Advani in President Race కురువృద్దుడు కి అవకాశం ఇస్తాడా మోడీ..?

  0
  19
  Want create site? Find Free WordPress Themes and plugins.


  రెండు సీట్లకే పరిమితమైన బిజెపిని మితవాది వాజ్‌పేయ్‌ సరిగా ప్రమోట్‌ చేయలేకపోయారు. ఆ సమయంలో హిందుత్వాన్ని ఆయుధంగా, బాబ్రీ మసీదును అస్త్రంగా వాడి బిజెపిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఘనత లాల్‌కిషన్‌ అద్వానీ దే. ఎవరెన్ని చెప్పినా ఇది చరిత్ర. నాడు ఆయన బిజెపికి వేసిన పునాదులు, దేశంలోని వీధి వీధికి పార్టీని తీసుకెళ్లిన విధానం అద్భుతం. కానీ తనకన్నా సీనియర్‌ అయిన వాజ్‌పేయ్‌కే ఆయన ప్రధాన మంత్రి పదవిని ఇచ్చాడు. తాను ఉపప్రధానిగా, హోంశాఖ చూసుకున్నాడు. ఆ సమయంలో వచ్చిన కార్గిల్‌ యుద్దం, మతకలహాలు, జిహాదీలు, కాశ్మీర్‌ వంటి విషయాలలో ఆయన కఠినంగా వ్యవహరించి నిజంగానే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తర్వాత ఉక్కుమనిషి అనే పేరును సార్ధకం చేసుకున్నాడు. 

  కానీ ఆ తర్వాత పీఠం ఎక్కిన ఏ బిజెపి అధ్యక్షుడు కూడా అలా దృఢంగా వ్యవహరించలేకపోయాడు. ఇప్పుడు అమిత్‌షా బాగానే వర్క్‌ చేస్తూ, పార్టీ వ్యూహాలను రచిస్తున్నాడు, నేడు ప్రధానిగా ఉన్న మోదీ, అమిత్‌షా ఈ స్థాయికి ఎదగడానికి అద్వానీయే కారణం. గోద్రా అల్లర్ల సందర్భంగా మోదీని పీఠం దించాలని వాజ్‌పేయ్‌ ఆలోచన చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. మరలా రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దగల నేత మోదీనే అని నమ్మాడు. ఇక కిందటి ఎన్నికల్లో బిజెపి మోదీని చూపించి ఓట్లు అడిగింది కాబట్టి అద్వానీ మౌనం వహించాడు. కానీ మోదీ కనీసం తనగురువుకు రాష్ట్రపతి పదవైనా ఇస్తాడా? అనే అనుమానం ఇప్పటికీ ఉంది. 

  అద్వానీ అతివాది అయినా ఆయనకు అన్ని పార్టీలలో మిత్రులున్నారు. అందుకే బిజెపి అంటే మండిపడే మమతాబెనర్జీ సైతం అద్వానీ అయితే బలపరుస్తామని చెప్పింది. ఒక్క వామపక్షాలు మినహా అందరూ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ మోదీ మాత్రం మహిళ అనే పేరుతో సుష్మాస్వరాజ్‌, గిరిజన వనతి అని ముర్మాను, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ని, బీహార్ గవర్నర్ గా చేస్తున్న రాంనాథ్ కోవింద్ ని దృష్టిలో పెట్టుకున్నాడు. రాష్ట్రపతి అంటే కనీసం ఎవరికీ తెలియని మొహాన్ని తీసుకొచ్చి ఇవ్వడంకాదు. రాజ్యాంగాన్ని, సంక్షోభాలను, విపత్కర నిర్ణయాలను, ప్రభుత్వానికి ముద్రలా కాకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన వారు అవసరం. 

  సో.. అద్వానీపేరునే ఫైర్‌బ్రాండ్‌ శతృష్నుసిన్హా నుంచి అందరు మద్దతిస్తున్నారు. ఇక తాజాగా బిజెపి పార్లమెంటరీ సమావేశం  మొదలైంది. దీనిలో రాష్ట్రపతి పేరును నిర్ణయిస్తారు. అందరూ అద్వానీయే అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా అద్వానీని రాష్ట్రపతిని చేయాలని పోస్టర్లు, బేనర్లు వెలుస్తున్నాయి. మొత్తానికి మోదీ విదేశాలకు వెళ్లేలోపు అంటే ఈనెల 24లోపే రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తారు. చూద్దాం.. మోదీ, షాల ట్రిక్కులు ఎలా ఉన్నాయో…?  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY