19 నుంచి సిట్ విచారణ.. పూరీ, ఛార్మీ, ముమైత్, రవితేజ, నవదీప్ హాజరు | Puri Jagannadh, Charmi, Raviteja are going to attend before SIT

  0
  9
  Want create site? Find Free WordPress Themes and plugins.


  డ్రగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నది. హైదరాబాద్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా మారిన డ్రగ్ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపడానికి చర్యలు చేపడుతున్నారు. త్వరితగతిన కేసు విచారణను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే డ్రగ్ కేసులో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సినీ ప్రముఖులు 19వ తేదీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముందుకు రాబోతున్నారు.

  17 1500305311 drug home 19 నుంచి సిట్ విచారణ.. పూరీ, ఛార్మీ, ముమైత్, రవితేజ, నవదీప్ హాజరు | Puri Jagannadh, Charmi, Raviteja are going to attend before SIT

  విచారణకు పూరీ, ఛార్మీ, ముమైత్, సుబ్బరాజు

  ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ నెల 19న, సినీ ప్రముఖులు ఛార్మీ 20న, ముమైత్ ఖాన్ 21న, సుబ్బరాజు, 23న, ప్రముఖ కెమెరామ్యాన్‌ ఛోటాకే నాయుడు సిట్‌ ఎదుట హాజరుకానున్నట్టు సమాచారం.

  17 1500305318 raviteja1 19 నుంచి సిట్ విచారణ.. పూరీ, ఛార్మీ, ముమైత్, రవితేజ, నవదీప్ హాజరు | Puri Jagannadh, Charmi, Raviteja are going to attend before SIT

  24 తేదీ నుంచి రవితేజ, తరుణ్, తనీష్

  ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్‌ ముందు హాజరుకానున్నట్టు తెలుస్తున్నది. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా 25న, హీరో నవదీప్ 26న, హీరో తరుణ్ 27న, తనీష్, నందును ఈ నెల 28న సిట్ విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లయిర్ కెల్విన్ ఫోన్ కాల్ డాటా ప్రకారం వీరందరికి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

  17 1500305304 drug2 19 నుంచి సిట్ విచారణ.. పూరీ, ఛార్మీ, ముమైత్, రవితేజ, నవదీప్ హాజరు | Puri Jagannadh, Charmi, Raviteja are going to attend before SIT

  రవితేజ పేరు రావడం బాధకరం..

  డ్రగ్ కేసులో నోటీసులు జారీ అయిన నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ తల్లి రాజ్యలక్ష్మి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. డ్రగ్ కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించింది అని ఆమె అన్నారు.

  17 1500305295 drug1 19 నుంచి సిట్ విచారణ.. పూరీ, ఛార్మీ, ముమైత్, రవితేజ, నవదీప్ హాజరు | Puri Jagannadh, Charmi, Raviteja are going to attend before SIT

  మరో దఫా నోటీసులు జారీ చేస్తాం

  తొలి దఫాలో నోటీసులు జారీ చేసిన సినీ ప్రముఖుల విచారణ తర్వాత మరో దఫాలో మరికొందరి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు వెల్లడిస్తున్నారు. డ్రగ్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖుల మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ఈ నెల 20వ తేదీన ఓ ప్రముఖ నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకొవచ్చనే వార్త బలంగా వినిపిస్తున్నది. అయితే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రాకుండా సినీ ప్రముఖుల పేర్లను గోప్యంగా ఉంచుతున్నట్టు పలువురు అధికారులు పేర్కొంటున్నారు.

  English summary

  Investigation of Drug links with Tollywood is moving with fast manner. Officials are interogating the Drug supplier Kelvin in their custody. Reports suggest that Kelvin has told many interesting and shocking things to officials. actors Raviteja, Charmi, Mumaith Khan, Navadeep are going to attend before SIT from 19th July. In this connection, Police may arrest few tollywood celebrities soon.

  Please Wait while comments are loading…  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY