రజినీ తేరా దాల్ మే కుచ్ “కాలా” హై.., కరికాలన్ కథ నాదే అంటూ కోర్టుకెక్కిన డైరెక్టర్ | K Rajasekaran aka KS Nagaraj has filed a complaint alleging the title of Kaala

  0
  13
  Want create site? Find Free WordPress Themes and plugins.


  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కబాలి లాంటి సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు పా. రంజిత్‌ ఇప్పుడు మరోసారి అతడితోనే కాలా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనదేనంటూ కె.రాజశేఖరన్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

  kala 31 1496220620 రజినీ తేరా దాల్ మే కుచ్ కాలా హై.., కరికాలన్ కథ నాదే అంటూ కోర్టుకెక్కిన డైరెక్టర్ | K Rajasekaran aka KS Nagaraj has filed a complaint alleging the title of Kaala

  సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో ‘కరికాలన్’ అనే టైటిల్ ను తాను రిజిస్టర్ చేయించానని… ఈ సినిమాను రజనీతోనే నిర్మించాలని భావించానని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే, దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుసుకుని, తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. తన సొంత కథతో సినిమాను నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.

  ఇంతకూ ఈ రాజశేఖరన్ ఎవరూ అంటే అది మరింత ఆసక్తి కర విశయం. రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తే. కాలా క‌రికాల‌న్ అనే చిత్ర టైటిల్ ని తాను 1996లోనే సౌత్ ఇండియ‌న్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ లో రిజిస్ట‌ర్ చేసుకున్నాననీ. ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ సినిమాను తెరకెక్కించాల‌ని, ఫ్యాన్స్ క్ల‌బ్ త‌ర‌పున ప‌లు మార్లు తలైవాని క‌లిసాను అనిచెబుతున్నాడు.

  image 31 1496220647 రజినీ తేరా దాల్ మే కుచ్ కాలా హై.., కరికాలన్ కథ నాదే అంటూ కోర్టుకెక్కిన డైరెక్టర్ | K Rajasekaran aka KS Nagaraj has filed a complaint alleging the title of Kaala

  ఫ్యాన్ క్ల‌బ్ చీఫ్ స‌త్య నారాయ‌ణ్ ద్వారా ర‌జనీకాంత్ కి క‌థ కూడా న‌రేట్ చేసిన‌ట్టు చెప్పటం మరింత ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి కాలా కథ కాపీ కథేనా అన్నది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ తాపిక్ అయ్యింది. తాను రాసుకున్న స్క్రిప్ట్ ని కాలా చిత్ర యూనిట్ దొంగిలించిందంటూ స్క్రిప్ట్ పేపర్స్ ని ఆధారాలుగా చూపిస్తూ చెన్నై పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశాడు నాగ‌రాజు. మ‌రి దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ పోలీసులు ఎలాంటి నివేదిక అందిస్తారో చూడాలి.

  English summary

  Director named K Rajasekaran aka KS Nagaraj has filed a complaint alleging the title & core plot of #Kaala have been stolen from his script  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY