‘మదర్స్ డే’ ఎందుకు?: అసలు దాని ప్రాధాన్యమేంటో తెలుసా! | Importance of mothers day and why do we celebrate this?

  0
  28
  Want create site? Find Free WordPress Themes and plugins.


  ‘అమ్మంటే నాన్నంత సమానం.. నాన్నంటే అమ్మంత సమానం’ అని. తల్లిదండ్రుల్లో ఎవరు గొప్ప అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. ఒక్కసారి ఈ వాక్యం గుర్తు చేసుకుంటే చాలు.

  “మర్మ స్థానం కాదది.. నీ జన్మ స్థానం..
  మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం”..

  సినీ గేయ రచయిత వేటూరి సుందరామ్మూర్తి రాసిన ఒక పాటలోని పాదం ఇది. తల్లిగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఇంతకన్నా గొప్పగా వర్ణించలేమేమో!. కేవలం రెండు లైన్లలోనే స్త్రీ గురించి వేటూరి అద్భుతమైన భావాన్ని వ్యక్తీకరించగలిగారు.

  ‘మదర్స్ డే’ ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు!..

  ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏటా మే రెండో ఆదివారం మదర్స్ డే జరపుకోవడానికి ప్రపంచమంతా సిద్దమవుతోన్న తరుణంలో.. అసలు మాతృమూర్తులకు ఎంతమేర సమానత్వం, స్వేచ్చ, గౌరవం దక్కుతున్నాయన్నది ఆలోచించాల్సిన అంశం.

  12 1494589741 11 mothers day11 08 1462679765 మదర్స్ డే ఎందుకు?: అసలు దాని ప్రాధాన్యమేంటో తెలుసా! | Importance of mothers day and why do we celebrate this?

  ఒక్క రోజుకే పరిమితం చేయకూడదు:

  మాతృమూర్తుల సేవలను గుర్తుచేసుకోవడం కోసం ఒక రోజంటూ ఏర్పడటం నిజంగా హర్షించదగ్గ విషయం. అదే సమయంలో దీన్ని ఒక్క రోజుకే పరిమితం చేయడం కూడా అసంబద్దం. కేవలం మదర్స్ డే నాడు స్పీచులకో, వేదికల మీద ఫోటో పోజులకో ఇలాంటి కార్యక్రమాలు పరిమితమైతే.. దీని అసలు ఉద్దేశం దెబ్బతింటుంది.

  12 1494589750 12 09 mother2 08 1462692570 మదర్స్ డే ఎందుకు?: అసలు దాని ప్రాధాన్యమేంటో తెలుసా! | Importance of mothers day and why do we celebrate this?

  మరేం చేయాలి?:

  స్త్రీలకు అంతట సమ ప్రాధాన్యం దక్కిన రోజు, హింస నుంచి వారు విముక్తి చేయబడ్డ రోజు, భ్రూణ హత్యల బారి నుంచి ఆడశిశువులను రక్షించిన రోజు ఈ ప్రపంచానికి మరింత మంది గొప్ప మాతృమూర్తులను అందించగలం. ముఖ్యంగా పితృస్వామ్య భావజాలాన్ని విడనాడి స్త్రీ-పురుష సమానత్వం సాధించిన రోజు.. తల్లులకు నిజమైన గౌరవం దక్కినట్లు లెక్క.

  12 1494589759 mothers day special 1 08 1462703667 మదర్స్ డే ఎందుకు?: అసలు దాని ప్రాధాన్యమేంటో తెలుసా! | Importance of mothers day and why do we celebrate this?

  అమ్మంటే నాన్నంత సమానం..:

  మేల్ కొలుపు అనే పుస్తకంలో.. ఒకానొక చోట అరుణ్ సాగర్ ఇలా చెబుతారు. ‘అమ్మంటే నాన్నంత సమానం.. నాన్నంటే అమ్మంత సమానం’ అని. తల్లిదండ్రుల్లో ఎవరు గొప్ప అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. ఒక్కసారి ఈ వాక్యం గుర్తు చేసుకుంటే చాలు. అయితే ఆర్థికంగా, సామాజికంగా తండ్రి ఎలాంటి హోదాను, స్వేచ్చను అనుభవిస్తారో.. తల్లికి కూడా అలాంటి స్వేచ్చ లభించినప్పుడే వారికి నిజమైన గౌరవం దక్కుతునట్లుగా భావించాలి.

  English summary

  These are interesting things that behind Mothers Day. When the women gets equality then only Mothers will get complete respect  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY