బాహుబలి 2 బిజినెస్ దుమ్మురేపుతుందిగా..! బాహుబలి,2,బిజినెస్,దుమ్మురేపుతుందిగా.., baahubali movie, director raja mouli, baahubali 2 movie, business 130 crores, prabhas, anushka, tamanna

  0
  84
  Want create site? Find Free WordPress Themes and plugins.


  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి2 ది కంక్లూజన్. ఈ చిత్రం రెండవభాగం ఈ సమ్మర్ లో విడుదల కానుంది. బాహుబలి ది బిగినింగ్ విడుదలై ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు బాహుబలి రెండవభాగం వంతు వచ్చింది. బాహుబలి మొదటి భాగం బిజినెస్ ఎంత బాగా చేసిందో తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు బాహుబలి2 ప్రీ రిలీజ్ బిజినెస్ బాహుబలి పార్ట్ ఫుల్ రన్ కలెక్షన్స్ కు మించి జరుగుతుందని పరిశ్రమ వర్గాల టాక్ నడుస్తుంది.

  బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 66 కోట్లకు విక్రయించగా 110 కోట్లు వరకు వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బాహుబలి2 బిజినెస్ టైమ్ నడుస్తుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకమొత్తంగా 130 కోట్లకు చేరిపోయింది. మొత్తానికి దీన్ని బట్టి చూస్తే.. బాహుబలి పార్ట్1 ఫుల్ రన్ లో రాబట్టిన కలెక్షన్స్ కంటే 20 కోట్లు ఎక్కువగానే వచ్చాయన్న మాట. ఏరియా వైజ్ తీసుకున్నా గతంలో దానికంటే ఎక్కువ మొత్తానికే విక్రయించినట్లుగా తెలుస్తుంది. బాహుబలి నైజాం ప్రాంతం వరకే చూసుకుంటే.. గతంలో  ఆ ప్రాంతం రైట్స్ సుమారు 23 కోట్లు అయితే  ఇప్పుడు బాహుబలి2 వచ్చేసరికి 47 కోట్ల రూపాయల వరకు విక్రయించినట్లు పరిశ్రమలో టాక్ నడుస్తుంది. కాగా చిత్రం సమ్మర్ సీజన్ లో విడుదల అవుతుండటంతో రూ.130 కోట్ల లక్ష్యానికి చేరుకోవడం సులభమే అని కూడా అంతటా టాక్.  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY