బాహుబలి వస్తున్నాడు.. ఇక థియేటర్లలో బీభత్సమే..!

  0
  45
  Want create site? Find Free WordPress Themes and plugins.


  తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏక్కడ చూసినా ఎవ్వరి నోట విన్నా ఒకే సినిమా గురించి చర్చిస్తున్నారు..అదే బాహుబలి 2.  గత సంవత్సరం బాహుబలి చిత్రం రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో పెను సంచలనాలు సృష్టించారు.  అంతే కాదు సినిమాలోని క్యారెక్టర్స్ కి సంబంధించి ప్రతిరోజు ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు.  ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద పెద్ద యుద్దాలే జరిగాయి.  కొన్ని టిక్కెట్లు అయితే వేలల్లో బ్లాక్ లో అమ్ముడు పోయాయి.  

  Baahubali 2 The Conclusion Movie Latest Working Stills Posters1 బాహుబలి వస్తున్నాడు.. ఇక థియేటర్లలో బీభత్సమే..!

  తాజాగా బాహుబలి  చిత్రానికి సీక్వెల్ బాహుబలి 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  అంతే కాదు బాహబలి ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప తనకు ఎంతో ఇష్టమైన అమరేంద్ర బాహుబలిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్న విషయం తెలుసుకోవాలని తెగ కుతూహలపడుతున్నారు.  అమరేంద్ర బాహుబలి మరో మూడు రోజుల్లో వస్తున్నాడంటూ బాహుబలి టీమ్ తాజాగా ప్రభాస్ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది.

  Baahubali 2 The Conclusion Movie Latest Working Stills Posters2 బాహుబలి వస్తున్నాడు.. ఇక థియేటర్లలో బీభత్సమే..!

  అసాధ్యాలను దాటుకుని ఇక మీ ముందుకు వస్తున్నాడని తన ట్విటర్ లో పేర్కొంటూ కేరళలో 300 థియేటర్లలో ఈ చిత్రం విడుదల అవుతోందని తెలిపింది. ఇప్పటివరకు ప్రభాస్ ని ఈ లుక్ లో చూడలేదని, ఈ పోస్టర్ అద్భుతమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి మరో మూడు రోజులు బాహుబలి రిజల్ట్ ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలియబోతుంది. 

  కార్తికేయ ట్విట్ :
  5/
  5 -
  (1 votes)


  Add To Favourite  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY