ద్రవిడ్ శిక్షణలో బెటర్ బ్యాట్స్‌మెన్‌గా: ఆ ఓటమిపై బిల్లింగ్స్ | Working with Rahul Dravid has made me a better batsman: Sam Billings

  0
  61
  Want create site? Find Free WordPress Themes and plugins.


  హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో తన బ్యాటింగ్‌ మరింత మెరుగవుతుందని ఇంగ్లాండ్ కీపర్‌, బ్యాట్స్‌ మన్‌ శామ్‌ బిల్లింగ్స్‌ తెలిపాడు. గతేడాది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో శామ్ బిల్లింగ్స్ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

  గతేడాది ఐపీఎల్‌లో ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంతో పాటు, ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకున్నట్లు బిల్లింగ్స్‌ పేర్కొన్నాడు. వివిధ పరిస్ధితుల్లో ఆట ఆడటం అనేది ఓ గొప్ప ఎక్స్ పీరియన్స్ అని చెప్పాడు.

  billings 10 1491844887 ద్రవిడ్ శిక్షణలో బెటర్ బ్యాట్స్‌మెన్‌గా: ఆ ఓటమిపై బిల్లింగ్స్ | Working with Rahul Dravid has made me a better batsman: Sam Billings

  File photo: Sam Billings (left)

  ఐపీఎల్‌లో ఆరు వారాల పాటు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనడం ఎంతో నేర్చుకున్నదానితో సమానం. ఏది ఏమైనప్పటికీ తన ప్రదర్శనను మరింత మెరుగు పరచుకునేందుకు యత్నిస్తున్నానని చెప్పాడు. ఇక, ఢిల్లీ మెంటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కోచ్‌ ప్యాడి ఆప్టన్‌ నేతృత్వంలో ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు బిల్లింగ్స్‌ తెలిపాడు.

  వారిచ్చే సూచనలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నాడు. వారి అనుభవాలు పంచుకోవడం, సలహాలు ఇవ్వడంతో బ్యాటింగ్‌లో రాటుదేలుతానని బిల్లింగ్స్‌ అభిప్రాయపడ్డాడు. ఇక జట్టు కూర్పు విషయానికి వస్తే, ఢిల్లీలో మంచి నైపుణ్య ఆటగాళ్లు ఉన్నారని, అయినా తొలి మ్యాచ్‌ బెంగళూరుపై ఓడిపోవడం నిరాశకు గురిచేసిందని అన్నాడు.

  ఇది మాకు నిజంగా ఊహించలేని ఫలితమని, జరగబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించమని బిల్లింగ్స్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో ప్రతి జట్టు బలమైనదే అని, ప్రతి జట్టులో హిట్టర్లు, స్పిన్నర్లున్నారని అన్నాడు. మ్యాచ్ ఆడే సమయంలో వారి బలాలను ప్రదర్శించినపుడే ఫలితం ఉంటుందని బిల్లింగ్స్ పేర్కొన్నాడు.

  ప్రస్తుతం తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించామని చెప్పిన బిల్లింగ్స్, ఢిల్లీ జట్టులో పేస్‌ బౌలింగ్‌తో పాటు మంచి స్పిన్నర్లు జయంత్‌ యాదవ్‌, నదీమ్‌లు ఉన్నారని అన్నాడు.  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY