తేడా వస్తే నిండా మునిగిపోతారు, ఏందీ పిచ్చి? రోబో 2.0 తెలుగు ఎంతకుకొన్నారో తెలుసా…??? | Rajinikanth Robo 2.0 Telugu Rights Sold Out

  0
  11
  Want create site? Find Free WordPress Themes and plugins.


  రజినీకాంత్ చివరి సినిమా ‘కబాలి’ని తెలుగులో దాదాపు రూ.32 కోట్లకు అమ్మారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ ప్రభావం ‘2.0’ మీద ఏమీ పడలేదు. ఎందుకంటే దీని మీద ఉన్న అంచనాలే వేరు. ఇది శంకర్ సినిమా ఆయె. అందులోనూ ‘రోబో’ తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ‘2.0’ మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది కూడా ‘బాహుబలి: ది కంక్లూజన్’ తరహాలోనే ప్రకంపనలు సృష్టిస్తుందని.. అనూహ్యమైన వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

  12 1502514714 robo 2 0 hollywood 666 తేడా వస్తే నిండా మునిగిపోతారు, ఏందీ పిచ్చి? రోబో 2.0 తెలుగు ఎంతకుకొన్నారో తెలుసా...??? | Rajinikanth Robo 2.0 Telugu Rights Sold Out

  ఫ్లాప్ వెంచర్

  కబాలి సినిమా తెలుగు హక్కుల కోసం భారీగా ఖర్చుపెట్టారు ఇక్కడి ప్రముఖులు. కానీ టాలీవుడ్ లో ఆ సినిమా ఫ్లాప్ వెంచర్. అంతకంటే ముందొచ్చిన లింగా తెలుగు రైట్స్ ను కూడా ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు.కానీ ఆ మూవీ రిజల్ట్ కూడా సున్నా. రజనీకాంత్ త్రీడీ సినిమా విక్రమసింహ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇన్ని ఎదురు దెబ్బలు, జీవిత కాలానికి సరిపడ అనుభవాలు ఉన్నప్పటికీ.. మరోసారి రజనీకాంత్ సినిమాపై వేలం వెర్రి కనిపిస్తోంది.

  12 1502514734 robo 2 0 697 తేడా వస్తే నిండా మునిగిపోతారు, ఏందీ పిచ్చి? రోబో 2.0 తెలుగు ఎంతకుకొన్నారో తెలుసా...??? | Rajinikanth Robo 2.0 Telugu Rights Sold Out

  60 కోట్ల రూపాయలకు చేరింది.

  ఏమో గుర్రం ఎగరావచ్చు అనే టైపులో రజనీకాంత్ సినిమా బ్లాక్ బస్టర్ కావొచ్చంటూ లేటెస్ట్ మూవీ 2.0పై రికార్డు స్థాయిలో బెట్టింగ్ సాగుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం బిడ్డింగ్ 40కోట్ల రూపాయల నుంచి ప్రారంభం కాగా, తాజాగా ఆ లెక్క 60 కోట్ల రూపాయలకు చేరింది.

  12 1502514724 robo 2 baahubali 666 తేడా వస్తే నిండా మునిగిపోతారు, ఏందీ పిచ్చి? రోబో 2.0 తెలుగు ఎంతకుకొన్నారో తెలుసా...??? | Rajinikanth Robo 2.0 Telugu Rights Sold Out

  బాహుబలి: ది కంక్లూజన్

  ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థే శంకర్-రజినీకాంత్‌ల మాగ్నమ్ ఓపస్ ‘2.0’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతుండటం విశేషం. విడుదలకు ఆరు నెలల ముందే ‘2.0′ తెలుగు హక్కుల డీల్ పూర్తయింది.

  12 1502514743 r 2 తేడా వస్తే నిండా మునిగిపోతారు, ఏందీ పిచ్చి? రోబో 2.0 తెలుగు ఎంతకుకొన్నారో తెలుసా...??? | Rajinikanth Robo 2.0 Telugu Rights Sold Out

  గ్లోబల్ సినిమాస్ భాగస్వామ్యంతో

  సునీల్ నారంగ్ నేతృత్వంలోని గ్లోబల్ సినిమాస్ భాగస్వామ్యంతో తెలుగులో ‘2.0’ను విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్సన్స్’ ప్రకటించింది. భారీ ధరకు ‘2.0’ను అమ్మినట్లు లైకా అధినేత రాజు మహాలింగం ట్విట్టర్లో వెల్లడించాడు. ఆ రేటు ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఐతే ఈ డీల్ రూ.60 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

  PLEASE READ  uruguay becomes the first country to sell marijuana hrough their pharmacies

  12 1502514760 r 5 తేడా వస్తే నిండా మునిగిపోతారు, ఏందీ పిచ్చి? రోబో 2.0 తెలుగు ఎంతకుకొన్నారో తెలుసా...??? | Rajinikanth Robo 2.0 Telugu Rights Sold Out

  60 కోట్లన్నది భారీగా అనిపించొచ్చు

  అందుకే విడుదలకు ఆర్నెల్ల ముందే బిజినెస్ దాదాపుగా పూర్తి కావస్తోందని చెబుతున్నారు. తెలుగు వెర్షన్‌కు రూ.60 కోట్లన్నది భారీగా అనిపించొచ్చు కానీ.. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఆ మొత్తాన్ని వసూలు చేయడం పెద్ద విషయం కాదు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

  English summary

  Global Cinemas which distributed ‘Baahubali: The Conclusion’ in Nizam territory acquired the Telugu Theatrical Rights of sci-fi flick ‘2.0’ for a record price.

  Story first published: Saturday, August 12, 2017, 10:44 [IST]

  Please Wait while comments are loading…  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY