“కాలా” మరో సంచలనం: అంబేద్కర్ గా కనిపిస్తాడట | Mammootty as Ambedkar in Rajnikanth’s Kaala?

  0
  25
  Want create site? Find Free WordPress Themes and plugins.


  దాదాపు ఇరవయ్ అయిదేళ్ళ క్రితం వచ్చిన ‘దళపతి’ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందా? మణిరత్నం ఇచ్చిన బిగ్గెస్ట్ అందులో రజనీకాంత్, మమ్ముట్టిల నటన ప్రేక్షకుల మదిలో ఇంకా మెదులుతూనే ఉంటుంది. అంతలా మెస్మరైజ్‌ చేసిన రజనీ, మమ్ముట్టి మళ్లీ కలసి నటిస్తున్నారని చెన్నై టాక్‌. ‘కాలా’లో బీఆర్‌ అంబేద్కర్‌గా మమ్ముట్టి కనిపిస్తారని కోడంబాక్కమ్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి.

  05 1496649739 kala 1 కాలా మరో సంచలనం: అంబేద్కర్ గా కనిపిస్తాడట | Mammootty as Ambedkar in Rajnikanths Kaala?

  దళపతి

  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలసి రెండున్నర దశాబ్దాల క్రితం ‘దళపతి’ సినిమాలో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో దక్షిణాది ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సూపర్ స్టార్లు కలసి ఓ చిత్రంలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి.

  05 1496649748 kala 2 కాలా మరో సంచలనం: అంబేద్కర్ గా కనిపిస్తాడట | Mammootty as Ambedkar in Rajnikanths Kaala?

  కాలా

  పా రంజిత్ దర్శకత్వంలో ప్రస్తుతం రజనీ ‘కాలా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. రజనీ అల్లుడు ధనుశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర వుందట. దీనిని పోషించమని మమ్ముట్టిని అడుగుతున్నట్టు సమాచారం. ఇందులో నటించడానికి మమ్ముట్టి కూడా సానుకూలంగా ఉన్నాడట.

  05 1496649757 kala 3 కాలా మరో సంచలనం: అంబేద్కర్ గా కనిపిస్తాడట | Mammootty as Ambedkar in Rajnikanths Kaala?

  మాఫియా డాన్

  రజనీ మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబయ్ లో జరుగుతోంది. తాజాగా విడుదలైన కాలా ఫస్ట్ లుక్‌ను బట్టి మహారాష్ట్రలో కులవివక్షపై తిరగబడే రోల్‌లో రజినీ నటిస్తున్నాడని.. ఆ పరిణామ క్రమంలోనే డాన్‌గా మారతాడని టాక్ నడుస్తోంది.

  05 1496649765 kala 4 కాలా మరో సంచలనం: అంబేద్కర్ గా కనిపిస్తాడట | Mammootty as Ambedkar in Rajnikanths Kaala?

  ఎంహెచ్‌ 01 బీఆర్‌ 1956

  ఇదిలా ఉండగా ఈ మూవీలో ప్రముఖ నటుడు మమ్ముట్టి డా. బి. ఆర్ అంబేద్కర్‌ రోల్ చేయబోతున్నట్టు తాజా సమాచారం .‘కాలా’ ఫస్ట్‌ లుక్‌లో ‘ఎంహెచ్‌ 01 బీఆర్‌ 1956′ నంబర్‌ ప్లేటున్న జీపుపై రజనీ కూర్చున్నారు కదా. దాన్ని బట్టి సినిమాలో బీఆర్‌ అంబేద్కర్‌కు సంబంధించిన సీన్లు ఉండే ఛాన్సుందని అర్థమైంది.

  05 1496649774 kala 5 కాలా మరో సంచలనం: అంబేద్కర్ గా కనిపిస్తాడట | Mammootty as Ambedkar in Rajnikanths Kaala?

  అంబేద్కర్‌గా మమ్ముట్టి

  ఎందుకంటే… అంబేద్కర్‌ 1956లోనే మరణించారు గనుక! ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి… బీఆర్‌ అంబేద్కర్‌గా మమ్ముట్టి నటించనున్నారని చెబుతున్నారు. రజనీ ఫ్యాన్స్‌తో పాటు మమ్ముట్టి ఫ్యాన్స్‌ కూడా ఈ వార్త కల కాకూడదని కోరుకుంటున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్లను మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాలని ఆశ పడుతున్నారు.

  05 1496649784 kala 6 కాలా మరో సంచలనం: అంబేద్కర్ గా కనిపిస్తాడట | Mammootty as Ambedkar in Rajnikanths Kaala?

  40 రోజుల పాటు

  మే 28 నుండి ఈ చిత్రం ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. రజనీకాంత్ తో పాటు ప్రధాన పాత్రదారులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 40 రోజుల పాటు ముంబై షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ కానుండగా, మూవీపై భారీ క్రేజ్ తెచ్చేందుకు ఆయా భాషలలోని స్టార్ నటీనటులని ప్రధాన పాత్రలకు ఎంపిక చేస్తున్నారు.

  English summary

  Mammootty might just play a cameo in the film Kaala. Rumours go that there is none better than Mammootty to play the social reformer, having done the role in an earlier film on Ambedkar.

  Please Wait while comments are loading…  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY