ఒక్కడు 2 రానుందా? ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమట | Gilli 2 script is ready, says director Dharani

  0
  54
  Want create site? Find Free WordPress Themes and plugins.


  మహేష్ నటించిన ఒక్కడు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ హిట్. అప్పటిదాకా ఉన్న మహేష్ బాడీ లాంగ్వేజ్ ని మార్చి ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ తెచ్చిన సినిమా. అయితే ఆ సినిమా ప్రారంభం వెనక చాలా గమ్మత్తయిన సంగతులే ఉన్నాయి. స్వతహాగా గుణశేఖర్ కి ఛార్మినార్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ పాతబస్తీ వెళితే ఛార్మినార్ దగ్గర టీ తాగకుండా వెనక్కి రారు. అలా ఓసారి ఛార్మినార్ వెళ్లినప్పుడు అతడి మనసులోకి బ్రిలియంట్ ఆలోచన వచ్చిందట అలా మొదలయ్యాడు ఆ “ఒక్కడు”

  22 1492839657 okkadu 1 ఒక్కడు 2 రానుందా? ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమట | Gilli 2 script is ready, says director Dharani

  ఒక్కడు

  దేవీ పుత్రుడు లాంటి ఫ్లాప్ ని నిర్మించిన ఎమ్మెస్ రాజు మృగరాజు లాంటి ఫ్లాప్ తీసిన దర్శకుడు కలయిక.. అంటూ జనం నవ్వుకున్నారు. కానీ ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అందరి నోళ్లు మూయించింది. ఒక్కసారి మహేష్ కెరీర్ గ్రాఫ్ ని ఆకాసానికెత్తేసిన ఈ సినిమా మళ్ళీ వార్తల్లోకి ఎక్కేసింది ఇప్పుడెందుకూ అంటే…

  22 1492839664 okkadu 2 ఒక్కడు 2 రానుందా? ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమట | Gilli 2 script is ready, says director Dharani

  తమిళ్ లో గిల్లి

  ఇదే సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. గిల్లి పేరుతో కోలీవుడ్ ఒక్కడు రీమేక్ కాగా.. ఇళయ దళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ధరణి దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా తమిళ్ ఒక్కడు రూపొందింది. పవన్ కళ్యాణ్ తో బంగారం మూవీ చేసిన దర్శకుడు కూడా ఇతనే.

  22 1492839671 okkadu 3 ఒక్కడు 2 రానుందా? ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమట | Gilli 2 script is ready, says director Dharani

  విజయ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు

  రీసెంట్ గా ఈ ధరణి ఓ ఆసక్తి కరమైన విషయం చెప్పాడు. తాను గిల్లి చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించడమే కాదు.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసేశాడట. అంతే కాదు.. విజయ్ కు వినిపించడం కూడా జరిగిపోయిందట. విజయ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు మూవీ స్టార్ట్ చేసేస్తానంటున్నాడు ధరణి. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యమని అంటున్నాడు. మరి తెలుగులో గుణశేఖర్ కూడా సీక్వెల్ కి ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

   

   

  22 1492839679 okkadu 4 ఒక్కడు 2 రానుందా? ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమట | Gilli 2 script is ready, says director Dharani

  టాలీవుడ్ లో కుదరకపోవచ్చు

  అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రం ఈ ప్రయత్నం కుదరకపోవచ్చు ఎందుకంటే అప్పుడు మహేష్ కీ, ఇప్పుడు ఉన్న మహేష్ కీ చాలా తేడా ఉంది. ఇక గుణషేఖర్ సంగతి సరే సరి ప్రతాప రుద్ర లాంటి పెద్ద ప్రాజెక్ట్ల పై దృష్టి పెట్టాడు. ఈ ఇద్దరినీ పక్కన పెడితే ఇప్పుడు ఒక్కడు లాంటి కథని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుటారన్నదీ అనుమానమే… అదందీ సంగతి వీలైతే ఆ తమిళ సినిమా డబ్బింగ్ ఏమైనా రావొచ్చేమో చూద్దాం…

  English summary

  “Okkadu” Tamil remeak Gilli Director Dharani said Gilli2 script is ready. If Vijay sir says OK, I’m ready to direct it. We have to wait and see whether this historical combo will unite again or not.  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY