అఖిల్‌‌కు కొత్తగా లవ్ ప్రపోజల్.. చేసింది ఎవరో తెలుసా? పారిపోయిన సిసింద్రీ | Akhil Akkineni reveals about his latest love proposal

  0
  7
  Want create site? Find Free WordPress Themes and plugins.


  అఖిల్ అక్కినేని పెళ్లి గురించి, అఫైర్ల గురించి ఈ మధ్యకాలంలో బాగానే రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ అలాంటి వాటికి దూరంగా ఉంటూ ప్రస్తుతం అఖిల్ బుద్దిగా కెరీర్‌పైనే దృష్టిపెట్టాడు. పెళ్లి, ప్రేమ వ్యవహరాలను దూరంగా పెట్టి దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా కోసం కష్టపడుతున్నాడు. తాజాగా రాజమౌళి, రమ దంపతుల కుమారుడు కార్తీకేయతో కలిసి రానా నిర్వహించే యారీ నంబర్ 1 షోకు గెస్ట్‌గా వెళ్లాడు. ఈ కార్యక్రమంలో తన తొలి సినిమా అనుభవాలను, తనకు ఒకరు చేసిన లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికరంగా వివరించాడు.

  17 1500286764 akhil1 అఖిల్‌‌కు కొత్తగా లవ్ ప్రపోజల్.. చేసింది ఎవరో తెలుసా? పారిపోయిన సిసింద్రీ | Akhil Akkineni reveals about his latest love proposal

  వినాయక్ కథ చాలా కొత్తగా అనిపించింది.

  రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న యారీ నంబర్ 1లో మాట్లాడుతూ.. దర్శకుడు వీవీ వినాయక్ అఖిల్ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించింది. ఓ కొత్త హీరో చేయగల కథ ఇదే అని నేను నమ్మాను. అందుకే ఆ కథకు ఓకే చెప్పి తొలిచిత్రంగా చేశాను. కానీ ఆ సినిమా చేసేటప్పుడే నేను తప్పు చేశానను అని అర్థమైంది. అప్పుడు ఇక చేసేది ఏమీ లేకపోయింది అని అఖిల్ వివరించారు.

  17 1500286771 akhil2 అఖిల్‌‌కు కొత్తగా లవ్ ప్రపోజల్.. చేసింది ఎవరో తెలుసా? పారిపోయిన సిసింద్రీ | Akhil Akkineni reveals about his latest love proposal

  విమానంలో లవ్ ప్రపొజల్

  సరదాగా సాగిన కార్యక్రమంలో ఎవరైనా ఈ మధ్యలో నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానం ఇస్తూ.. ఈ మధ్య విమానంలో ప్రయాణించేటప్పుడు ఓ సరదా సంఘటన ఎదురైంది. నేను హైదరాబాద్‌ నుంచి అబుదాబీకి వెళ్తున్నాను. విమానంలో నిద్ర పోతున్న సమయంలో నా ముందు ఉండే టీవీ స్క్రీన్‌పైన ఓ వ్యక్తి ఓ సందేశంతో కూడిన నోట్‌ను అతికించారు. లేచి చూసే సరికి ఆ నోట్ కనిపించింది.

  17 1500286786 akhil11 అఖిల్‌‌కు కొత్తగా లవ్ ప్రపోజల్.. చేసింది ఎవరో తెలుసా? పారిపోయిన సిసింద్రీ | Akhil Akkineni reveals about his latest love proposal

  నా ఎదురుగా లవ్ లెటర్

  ఏదో రాసినట్టు ఉండటం, ఆ పేపర్ ఏమై ఉంటుందా అనే అనుమానం రావడంతో తీసి చదివాను. వెంటనే నాకు ముచ్చెటమలు పట్టాయి. నీవు హాట్‌గా ఉన్నావు. నీవు సరే అంటే నేను రెడీ అని అందులో రాశారు. ఇంతకీ ఇది రాసింది ఎవరూ అని ఎయిర్‌హెస్టెస్‌ను అడుగగా ఆమె నవ్వూతూ అదోరకంగా చూసింది. మరోసారి ఆమెను అడుగటంతో నీకు ప్రపోజల్ పెట్టింది ఎవరో అనే విషయాన్ని నీవు నిజంగా తెలుసుకోవాలనుకొంటున్నావా అని అని ఎయిర్‌ హోస్టెస్ సమాధానం ఇచ్చింది.

  17 1500286778 akhil3 అఖిల్‌‌కు కొత్తగా లవ్ ప్రపోజల్.. చేసింది ఎవరో తెలుసా? పారిపోయిన సిసింద్రీ | Akhil Akkineni reveals about his latest love proposal

  లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు

  ఎయిర్ హోస్టెస్ అలా సమాధానంతో నాలో మరింత ఆసక్తి పెరిగింది. అవును అని సమాధానం ఇచ్చే సరికి నీకు లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు.. అబ్బాయి అని జవాబివ్వడంతో నేను కంగుతిన్నాను. అక్కడే ఆ అబ్బాయి ఉండటంతో కొంత భయపడ్డాను. విమానం ఆగగానే చెకవుట్ కోసం అక్కడి నుంచి వేగంగా పరుగుతీసి తప్పించుకొన్నాను అని ఈ సరదా సంఘటనను అఖిల్ వివరించాడు.

  17 1500286757 akhil అఖిల్‌‌కు కొత్తగా లవ్ ప్రపోజల్.. చేసింది ఎవరో తెలుసా? పారిపోయిన సిసింద్రీ | Akhil Akkineni reveals about his latest love proposal

  ఇమేజ్ డామేజ్ చేయవద్దు..

  అఖిల్, కార్తీకేయ పాల్గొన్న నంబర్ వన్ యారీ కార్యక్రమంలో హీరో సుశాంత్ వచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. కాసేపు సరదాగా గడిపి వెళ్లిపోయాడు. ఈ కార్యక్రమంలో అఖిల్‌ను రానా, కార్తీకేయ బాగా ఆటపట్టించారు. ఈ సందర్భంగా నా ఇమేజ్ డామేజ్ చేయవద్దని అఖిల్ వారిద్దరిని కోరాడు. మొత్తానికి అర్ధగంట నిడివి ఉన్న కార్యక్రమం చాలా ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.

  English summary

  Rajamouli son Kartikeya, Akhil Akkineni participated in Rana Daggubati’s Number 1 Yaari. They have lot fun in this show and shared some interesting incidents in their life. In this juncture Akhil revealed that he got love proposal from one guy.

  Story first published: Monday, July 17, 2017, 15:50 [IST]

  Please Wait while comments are loading…  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY